Lawrence Bishnoi Jail Interview: పంజాబ్ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌తో(Lawrence Bishnoi's interview ) ఇంటర్వ్యూ చేయడంపై పంజాబ్- హర్యానా హైకోర్టు(Punjab and Haryana High Court ) మండిపడింది.

Update: 2024-10-30 11:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌తో(Lawrence Bishnoi's interview ) ఇంటర్వ్యూ చేయడంపై పంజాబ్- హర్యానా హైకోర్టు(Punjab and Haryana High Court ) మండిపడింది. పంజాబ్ పోలీసుల తీరుని తప్పుబట్టింది. లారెన్స్ బిష్ణోయ్ బఠిండా జైల్లో పోలీసు కస్టడీలో ఉండగా.. వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. దీని రెండు విడుతల్లో మార్చి 2023లో ఒక నేషనల్ మీడియాలో ప్రసారం చేశారు. కాగా జైలు ప్రాంగణంలో బిష్ణోయ్ ఎలా మొబైల్‌ ఫోన్ వాడారని పిటిషన్ దాఖలైంది. దీనిపై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. బిష్ణోయ్‌ ఇంటర్వ్యూ కేసుని పరిశీలిస్తే అధికారులకు, గ్యాంగ్‌స్టర్‌కు మధ్య సంబంధం ఉందనే అనుమానం లేవనెత్తుతందని హైకోర్టు పేర్కొంది. ‘పోలీసు అధికారులు నేరస్థుడిని పోన్ వాడుకునేందుకు అనుమతించారు. ఇంటర్వ్యూను నిర్వహించడానికి స్టూడియో లాంటి సదుపాయాన్ని కల్పించారు. ఇవన్నీ నిందితుడికి అందించడం ద్వారా మీరు నేరాన్ని ప్రోత్సహించారు. కావున ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరం’ అని కోర్టు పేర్కొంది.

పంజాబ్ ప్రభుత్వానికి చీవాట్లు

ఇకపోతే, బిష్ణోయ్ ఇంటర్వ్యూకు అనుమతించిన సీనియర్ అధికారులపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తూ 2024 ఆగస్టులో ఉత్తర్వు వెలువడింది. అయితే,ఆ ఉత్తర్వును పాటించడంలో విఫలమైనందుకు పంజాబ్ ప్రభుత్వాన్ని (Punjab government) కోర్టు మందలించింది. అంతేగాక సస్పెండ్ చేసిన ఏడుగురు అధికారుల్లో ఐదుగురు జూనియర్ ర్యాంక్‌కు చెందినవారేననిని.. కేవలం ఇద్దరే డిప్యూటీ సూపరింటెండెంట్ ర్యాంక్‌ అధికారులని తెలిపింది. ఈ మేరకు మానవ హక్కుల కమిషన్ చీఫ్ ప్రబోధ్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందంతో దర్యాప్తు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.


Similar News