కన్నతండ్రిని పెళ్లి చేసుకున్న కూతురు.. ఇప్పటికే అతనికి మూడు పెళ్లిళ్లు?

ఇటీవల కాలంలో చాలా మంది దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వావి వరసలు మరిచి మానవత్వాన్ని మంట కలుపుతున్నారు.

Update: 2023-07-10 07:21 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వావి వరసలు మరిచి మానవత్వాన్ని మంట కలుపుతున్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం వెలుగులోకి వస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఈ కోవలోకి చెందినదే అని చెప్పాలి.

సాధారణంగా తండ్రి కూతురు బంధం ఎంత ప్రత్యేకమైనదో చెప్పాల్సిన పనిలేదు. కూతురులో తన తల్లిని చూసుకుంటాడు తండ్రి. కూతురు తన తండ్రి తన మొదటి సూపర్ హీరో అని భావిస్తూ ఉంటుంది. అయితే కొడుక్కి ఏదైనా కష్టం వచ్చినా చూసి చూడనట్టు ఉంటాడేమో.. కానీ కూతురికి ఏదైనా కష్టం వస్తే గంభీరంగా ఉండే తండ్రి సైతం తల్లడిల్లిపోతూ ఉంటాడు. కానీ, ఓ తండ్రి, కూతురు ఆ బంధానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించారు. తాజాగా, పాకిస్థాన్‌లో మరో విచిత్రమైన ఘటన చోటుచుసుకుంది. ఓ కూతురు కన్న తండ్రినే పెళ్లి చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌కు చెందిన రబియా అనే యువతి తన సొంత తండ్రిని పెళ్లి చేసుకుంది. దీనిపై ప్రశ్నిస్తే ఆమె చెప్పిన సమాధానం విన్నవారందరూ షాక్ అవుతున్నారు. రబియా మాట్లాడుతూ.. ‘‘నాలుగవ సంతానానికి రబియా అనే పేరు పెడతారని విన్నాను. కానీ నేను నా పేరెంట్స్ కి రెండో సంతానాన్నే.. నా పేరుకు న్యాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్న.. నా తండ్రికి ఇది నాలుగో పెళ్లి.. ఆయనకు నాలుగో భార్య గా ఉండడం వల్ల నా పేరుకు జస్టిఫికేషన్ లభిస్తుంది’’ అంటూ చెప్పుకొచ్చింది.


Similar News