భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భారత్ నుంచి ఆరుగురు కెనడా దౌత్యవేత్తల బహిష్కరణ
భారత్(India) - కెనడా(Canada) మధ్య దౌత్య వివాదం రోజు రోజుకు ఎక్కువైపోతుంది. ఖలీస్తాన్ ఉగ్రవాది హత్య అనంతరం ఇరు దేశాల మధ్య వివాదం చోటు చేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: భారత్(India) - కెనడా(Canada) మధ్య దౌత్య వివాదం రోజు రోజుకు ఎక్కువైపోతుంది. ఖలీస్తాన్ ఉగ్రవాది హత్య అనంతరం ఇరు దేశాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇది రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కెనడాతో దౌత్య సంబంధాలు తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కెనడా నుంచి భారత హై కమిషనర్(Indian High Commissioner)ను వెనక్కు కేంద్రం పిలిపించింది. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఉన్న ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. వారు అక్టోబర్ 19, 2024 శనివారం రాత్రి 11:59 గంటలకు లేదా అంతకంటే ముందు భారతదేశం నుండి బయలుదేరి వెళ్లిపోవాలని MEA ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో దేశం విడిచి వెళ్లిపోవాల్సిన వారిలో..
1. స్టీవర్ట్ రాస్ వీలర్, యాక్టింగ్ హై కమిషనర్
2. పాట్రిక్ హెబర్ట్, డిప్యూటీ హైకమిషనర్
3. మేరీ కేథరీన్ జోలీ, మొదటి కార్యదర్శి
4. లాన్ రాస్ డేవిడ్ ట్రైట్స్, మొదటి కార్యదర్శి
5. ఆడమ్ జేమ్స్ చుయిప్కా, మొదటి కార్యదర్శి
6. పౌలా ఓర్జులా, మొదటి కార్యదర్శి లు ఉన్నారు.
Read More..
మరింత ముదిరిన వివాదం.. ఆ దేశంతో సంబంధాలు తగ్గించుకోవలని కేంద్రం నిర్ణయం