Rahul Gandhi : జార్ఖండ్ ఫలితాలపై రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ ట్వీట్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను క్షేత్ర స్థాయిలో సమీక్షిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను క్షేత్ర స్థాయిలో సమీక్షిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. రెండు రాష్ట్రాల ఫలితాల అనంతరం ‘ఎక్స్’ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. మహారాష్ట్ర ఫలితాలను తాము అస్సలు ఊహించలేదన్నారు. పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. జార్ఖండ్ ఫలితాలపై స్పందిస్తూ.. జార్ఖండ్‌లో ఇండియా కూటమి గెలుపు రాజ్యాంగంతో పాటు జల్, జంగల్, జమీన్ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో మహాయుతి కూటమికి 233 సీట్లు రాగా, ఇండియా కూటమి 49 సీట్లను గెలుచుకుంది. ఇతరులు 6 చోట్లు విజయం సాధించారు. జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు గానూ ఇండియా కూటమి 56, ఎన్డీఏ కూటమి 24, ఇతరులు ఒక సీటు గెలుచుకున్నారు.