PM Modi : ఎల్లుండి నుంచి ప్రధాని మోడీ అమెరికా పర్యటన.. షెడ్యూల్ ఇదీ
దిశ, నేషనల్ బ్యూరో : ఈనెల 21 నుంచి 23 వరకు జరగనున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటన ముఖ్య లక్ష్యం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమేనని విదేశాంగ శాఖ తెలిపింది.
దిశ, నేషనల్ బ్యూరో : ఈనెల 21 నుంచి 23 వరకు జరగనున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటన ముఖ్య లక్ష్యం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమేనని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ పర్యటన సందర్భంగా జరగనున్న క్వాడ్ కూటమి సదస్సులో ఇండో- పసిఫిక్ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రధాన చర్చ జరగనుందని వెల్లడించింది. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈవివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపారు.
ఈనెల 22న న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులతో పాటు వ్యాపార ప్రముఖులతోనూ ప్రధాని మోడీ భేటీ అవుతారని చెప్పారు. ‘‘తొలుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సొంతూరు విల్మింగ్టన్ (డెలావర్)కు భారత ప్రధాని వెళ్తారు. క్వాడ్ కూటమి సదస్సు అక్కడే జరుగుతుంది. సదస్సు ముగిసిన అనంతరం ప్రధాని న్యూయార్క్‌కు చేరుకుంటారు. పర్యటనలో చివరి రోజైన సెప్టెంబరు 23న (సోమవారం) ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జరిగేే ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’కు హాజరై ప్రసంగిస్తారు’’ అని విక్రమ్ మిస్రి వివరించారు.