కారులో పెళ్లికొడుకు డ్యాన్స్.. కట్‌చేస్తే, రూ.2 లక్షలు ఫైన్..!? (వీడియో)
పోలీసులు రూ.2 లక్షల వరకు చలాన్లు జారీ చేశారు.UP groom dances in open Audi while travelling, finally pays fine.
దిశ, వెబ్‌డెస్క్ః పెళ్లి సంబరం అంటేనే సంతోషం ఆకాశాన్నంటాలనుకుంటారు. అందులో తప్పులేదు కానీ, మన సంబరానికి ఇతరుల్ని ఇబ్బంది పెడితే మాత్రం సంతోషం ఏమోగానీ, శాపనార్థాలు చాలా వస్తాయి. ఇక, ఈ పెళ్లి కొడుక్కి శాపనార్థాలు వచ్చాయో లేవో కానీ, రోడ్డుపై చేసిన రచ్చకు రూ.2 లక్షలు జరిమానా పడింది. రద్దీగా ఉండే మెయిన్ రోడ్డుపై టాప్ లెస్ కారులో వెళుతూ, ట్రెండీగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు ఈ పెళ్లికొడుకు. వరుడితో పాటు స్నేహితుల కార్ల కాన్వాయ్ కూడా రచ్చరచ్చ చేశారు. వేడుక బాగానే జరిగింది కానీ, ఆ తర్వాత ముజఫర్‌నగర్ పోలీసులు వరుడికి జరిమానా వేశారు. ఒక వ్యక్తి ఆ సంబరాన్ని వీడియో రికార్డ్ చేసి స్థానిక పోలీసులకు ట్వీట్ చేయడంతో ఈ చర్య తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ముజఫరానగర్ పోలీసులు ట్విట్టర్‌లో షేర్ చేశారు. వరుడు, ఎరుపు రంగు ఆడి కారులో వెళుతుండగా, కారుకి ఉన్న పొడవైన కమ్మీలు, ఇతర వాహనదారుల్ని చాలా ఇబ్బంది పెట్టాయి.
అంకిత్ కుమార్ అనే వ్యక్తి ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులకు పంచుకున్నాడు. "హరిద్వార్ నుండి నోయిడాకు వెళ్తున్న నా ప్రయాణంలో, ముజఫర్‌నగర్ జిల్లాలో కొంతమంది తమ వినోదం కోసం ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నాను" అని కుమార్ ట్వీట్‌లో రాశారు. కాగా, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ యాదవ్ ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేసి వరుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తొమ్మిది వాహనాలను గుర్తించిన పోలీసులు రూ.2 లక్షల వరకు చలాన్లు జారీ చేశారు.
➡️हाइवे पर गाडियों से स्टंट करने वाले वाहनों के विरुद्ध मुजफ्फरनगर पुलिस द्वारा की गयी कार्यवाही।
— MUZAFFARNAGAR POLICE (@muzafarnagarpol) June 14, 2022
➡️कुल 09 गाडियों का 02 लाख 02 हजार रुपये का चालान।@Uppolice @The_Professor09 @ankitchalaria pic.twitter.com/VqaolvazhO