Viral: తిట్టిండి.. ఇంకా తిట్టండి!.. మహిళల తిట్లకు చెవులు మూసుకున్న ఆర్మీ ఆఫీసర్
మహిళలు తిడుతుండగా.. తిట్టండి.. తిట్టండి.. ఎంతైనా తిట్టుకోండి! అంటూ ఓ ఆర్మీ ఆఫీసర్ చెవులు మూసుకున్న ఘటన మణిపూర్ లో జరిగింది.
దిశ, డైనమిక్ బ్యూరో: మహిళలు తిడుతుండగా.. తిట్టండి.. తిట్టండి.. ఎంతైనా తిట్టుకోండి! అంటూ ఓ ఆర్మీ ఆఫీసర్ చెవులు మూసుకున్న ఘటన మణిపూర్ లో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటన ప్రకారం మణిపూర్ లోని జిరిబామ్ లో కుకి ఉగ్రవాదులు డ్రోన్, క్షిపణి దాడులు చేస్తున్నారని, దాడుల వల్ల వాని నివాసాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంత మహిళలు అటుగా వచ్చిన ఆర్మీ వాహానాన్ని ఆపారు. అందులోనుంచి అస్సాం రైఫిల్స్ బెటాలియన్ కు చెందిన కల్నల్ ఆకాశ్ అతని టీం దిగారు.
ఆ మహిళలు వారిపై దుర్భాషలాడటం ప్రారంభించారు. కల్నల్ ఆకాష్ చెవులు మూసుకొని తిట్టిండి.. తిట్టండి.. ఇంకా తిట్టండి అని మహిళలకు చెబుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆ ఆర్మీ ఆఫీసర్ తీరుపై మండిపడుతున్నారు. వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆ వీడియో కింద ఓ నెటిజన్ ఇదే ఆర్మీ ఆఫీసర్ కు సంబంధించిన మరో వీడియో పోస్ట్ చేశాడు. అందులో కల్నల్ ఆకాశ్ మణిపూర్ వరదల్లో చిక్కుకున్న ఓ చిన్నపిల్లాడి కుటుంబాన్ని కాపాడినందుకు ఆ కుటుంబం అతనికి అభినందనలు చెబుతోంది. దీనిపై సోషల్ మీడియాలో చూసే ప్రతీ విషయాన్ని దృవీకరణ లేకుండా నమ్మవద్దని, అతడు పూర్తిగా వర్క్ ప్రొఫెషనల్ ఆఫీసర్ అని కామెంట్ చేశారు.