Chenab Bridge: చైనా కోరికను తీరుస్తున్న పాక్

జమ్ముకశ్మీర్ లోని చీనాబ్ వంతెన(Chenab Bridge ) సమాచారాన్ని పాక్(Pak ) సేకరిస్తుంది. బీజింగ్ కోరిక మేరకు పాక్, చైనా ఇంటెలిజెన్స్ వర్గాలు వంతెనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి.

Update: 2024-11-01 08:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్ లోని చీనాబ్ వంతెన(Chenab Bridge) సమాచారాన్ని పాక్(Pak) సేకరిస్తుంది. బీజింగ్ కోరిక మేరకు పాక్, చైనా(China) ఇంటెలిజెన్స్ వర్గాలు వంతెనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. జమ్ముకశ్మీర్ లోని రైసీ(Reasi), రాంబన్(Ramban) జిల్లాల మధ్య రైల్వే వంతెన నిర్మాణం పూర్తయ్యింది. ప్రపంచలోనే అత్యంత పొడవైన రైల్వే వంతెనగా(world’s tallest railway bridge) చీనాబ్ రికార్డులోకి ఎక్కింది. ఈ వంతెనను పూర్తి చేయడానికి ప్రభుత్వానికి 20 సంవత్సరాలు పట్టింది. మరోవైపు, చీనాబ్ వంతెనతో సరిహద్దు ప్రాంతంలో భారతదేశం వ్యూహాత్మక ప్రయోజనాన్ని పొందుతుంది. అందువల్లే పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ వంతెన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అత్యంత పొడవైన రైలు మార్గం

రైలు మార్గం ద్వారా కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో ఇది భాగం. చీనాబ్‌ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీని పొడవు 1315 మీటర్లు. ఇప్పటివరకు చైనాలోని బెయిపాన్‌ నదిపై ఉన్న షుబాయ్‌ రైల్వే వంతెన (275 మీటర్లు ఎత్తు) పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువ కావడం విశేషం. త్వరలోనే రైలు సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.


Similar News