Canada:కెనడాలో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. భారత సంతతికి చెందిన వ్యక్తి అరెస్టు

కెనడా (Canada)లో భారీగా డ్రగ్స్ (drugs) పట్టుబడ్డాయి. వాంకోవర్‌ పరిధిలో అక్రమంగా రన్ చేస్తున్న ల్యాబ్‌ను పోలీసులు గుర్తించారు.

Update: 2024-11-01 09:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా (Canada)లో భారీగా డ్రగ్స్ (drugs) పట్టుబడ్డాయి. వాంకోవర్‌ పరిధిలో అక్రమంగా రన్ చేస్తున్న ల్యాబ్‌ను పోలీసులు గుర్తించారు. ఆ ల్యాబ్ లో అధికారులు సోదాలు జరిపారు. అధికారుల తనిఖీల్లో డ్రగ్స్ తో పాటు అనేక రకాల హానికారక రసాయనాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఈ కేసులో భారత సంతతికి చెందిన గగన్ ప్రీత్ సింగ్ రాంధ్వాను పోలీసులు అరెస్టు చేశారు. కెనడా పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ లో కేజీలకొద్దీ ఫెంటానిల్‌, మెథాంఫెటమైన్‌, కొకైన్‌, ఎండీఎంఏ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా ప్రాణాంతక రసాయనాలు ఉన్నాయని వెల్లడించారు. అవే కాకుండా తుపాకులు, పేలుడు పదార్థాలు, ఇంకా పలు ఆయుధాలు, 5 లక్షల డాలర్ల నగదునుని గుర్తించారు. అక్రమంగా ఆయుధాల నిల్వ, డ్రగ్స్ సంబంధించి గగన్ ప్రీత్ రాంధ్వా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే, ఈ కేసులో మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా డ్రగ్స్‌ ఉత్పత్తి, సరఫరా చేస్తోన్న గ్రూప్‌ను కొన్ని నెలలపాటు దర్యాప్తు తర్వాత ఈ రాకెట్ ని ఛేదించామని తెలిపారు. ఈ ముఠాకు అంతర్జాతీయంగా సంబంధాలు ఉన్నాయన్నారు.


Similar News