MCX: మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ ఎండీగా ప్రవీణా రాయ్ నియామకం

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ప్రవీణా రాయ్(Praveena Roy) తన పదవికి రాజీనామా చేశారు.

Update: 2024-11-01 10:03 GMT

 దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ప్రవీణా రాయ్(Praveena Roy) తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వెంటనే మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్(MCX) మేనేజింగ్ డైరెక్టర్(MD) అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా బాధ్యతలు చేపట్టారు.కాగా ప్రవీణా రాయ్ నియామకానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(SEBI) గత ఆగస్టులోనే ఆమోదం తెలిపింది. ఆర్థిక సేవల రంగం(Financial services sector)లో ఆమెకు 30 ఏళ్ల అనుభవం ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్ఎస్‌బీసీ వంటి తదితర బ్యాంకుల్లో ఆమె పని చేశారు. అలాగే NPCIలో మార్కెటింగ్, ప్రొడక్ట్స్, టెక్నాలజీ, ఆపరేషనల్, బిజినెస్ స్ట్రాటర్జీ డెలివరీ వంటి బాధ్యతలు చేపట్టారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రవీణా రాయ్.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.

Tags:    

Similar News