Viral News: భర్త రోజూ స్నానం చేయట్లేదని .. పెళ్లైన 40 రోజులకే విడాకులు కోరిన భార్య..!

కొన్నిరోజులుగా ఎక్కడ చూసిన కూడా అనేక పెళ్లిళ్లు పెటాకులౌతున్నాయి.

Update: 2024-09-16 19:22 GMT

దిశ, వెబ్‌డెస్క్:కొన్నిరోజులుగా ఎక్కడ చూసిన కూడా అనేక పెళ్లిళ్లు పెటాకులౌతున్నాయి. బాలీవుడ్(Bollywood), క్రీడా(Sports), రాజకీయం(Politics),సామాన్య ప్రజలు(Common People) ఇలా ఎక్కడ చూసుకున్న కూడా అనేక విడాకుల వార్తలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ జంట పట్టుమని నెలన్నర రోజులు కూడా కలిసి ఉన్నారో లేదో అప్పుడే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి.ఓ మహిళ తన భర్త అపరిశుభ్రత కారణంగా పెళ్లైన 40 రోజులకే విడాకులు కోరింది. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ వార్తా నిజమేనండి బాబూ..! ఈ ఘటన ఎక్కడ జరిగింది ? కారణం ఏంటో తెలుసుకుంటే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్(UP) రాష్ట్రం ఆగ్రా(Agra)కు చెందిన ఓ మహిళ పెళ్లైన 40 రోజులకే విడాకులు(Divorce) కోరింది.తన భర్త నెలకు ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే స్నానం(Bath) చేస్తున్నాడని, దీంతో అతడి శరీరం నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నానని ఆగ్రాలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించింది. తమ పెళ్లైనప్పటి నుంచి తన భర్త ఇప్పటివరకు కేవలం 6 సార్లు మాత్రమే స్నానం చేశారని తెలిపింది. స్నానం చేయకపోగా వారానికోసారి గంగాజలం చల్లుకుంటాడని,అతడితో కలిసి జీవించడం తన వల్ల కాదని వాపోయింది.కౌన్సెలింగ్ తర్వాత రోజూ స్నానం చేసేందుకు భర్త ఒప్పుకున్నా ఆమె మాత్రం అతడితో ఇక జీవించడం ఇష్టం లేదని చెప్పినట్టుగా తెలుస్తోంది.దీంతో చేసేదేమిలేక ఈ నెల 22న మరోసారి కౌన్సెలింగ్ సెంటర్ కు రావాలని భార్యాభర్తలిద్దరికీ అధికారులు సూచించారు.  


Similar News