రాజ్యసభకు వినేష్ ఫొగాట్?

పారిస్ ఒలంపిక్స్ లో అనర్హత వేటు పడిన భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్ ను రాజ్యసభకు వెళ్లనుందా..?

Update: 2024-08-08 14:56 GMT

దిశ, వెబ్ డెస్క్ : పారిస్ ఒలంపిక్స్ లో అనర్హత వేటు పడిన భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్ ను రాజ్యసభకు వెళ్లనుందా..? అంటే ఇపుడు ఆ విషయం మీదే హర్యానాలో అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతల మధ్య జోరుగా మాటల యుద్దం నడుస్తోంది. వినేష్ ఫొగాట్ ను రాజ్యసభకు నామినేట్ చేయాలని హర్యానా మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు భూపేందర్ సింగ్ హుడా బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినేష్ మన దేశం గర్వపడే ప్రదర్శన చేసిందని, రాష్ట్ర అసెంబ్లీలో తమ పార్టీకి సంఖ్యాబలం ఉంటే ఖచ్చితంగా వినేష్ పేరును ప్రతిపాదించేదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. భూపేందర్ కుమారుడు దీపేందర్ హుడా కూడ తన తండ్రి వ్యాఖ్యలను సమర్థించాడు. తాను దిగువసభకు ఎన్నికవడం వల్ల రాజ్యసభలో హర్యానా నుండి ఒకస్థానం రాజ్యసభలో ఖాళీగానే ఉందని, ఆ స్థానానికి వినేష్ ను నామినేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాడు. కాగా కాంగ్రెస్ నేతల ఈ ప్రకటనను పొలిటికల్ స్టంట్ అంటూ కొట్టిపారేశారు హర్యానా బీజేపీ నేతలు. గతంలో హర్యానాలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గీతా ఫొగాట్ ను ఎందుకు రాజ్యసభకు పంపలేదని హుడాను నిలదీశారు.      


Similar News