Assam: హీట్ వేవ్ ఎఫెక్ట్.. కమ్రూప్ లో ఈనెల 27 వరకు పాఠశాలలకు సెలవులు

అసోంలో ఎండతీవ్రత పెరిగిపోయింది. కమ్రూప్ జిల్లాలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీంతో కమ్రూప్ జిల్లాలోనే ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలు మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Update: 2024-09-24 05:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అసోంలో ఎండతీవ్రత పెరిగిపోయింది. కమ్రూప్ జిల్లాలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీంతో కమ్రూప్ జిల్లాలోనే ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలు మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు అన్ని స్కూళ్లు మూసివేయనున్నట్లు తెలిపారు. కమ్రూప్ జిల్లా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అధికారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. “విద్యార్థుల అనారోగ్యం, సృహతప్పిపడిపోవడం సహా ఇతర సమస్యల గురించి కమ్రూప్ పరిధిలోని పలు పాఠశాలల నుంచి నివేదికలు వచ్చాయి. అధిక వేడి, ఎండతీవ్రత, ఉష్ణోగ్రతల పెరుగుతల వల్ల కమ్రూప్ జిల్లాలోని అన్ని పాఠశాలలు సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు మూసివేసేందుకు నిర్ణయించాం" అధిక వేడి వల్ల కలిగే దుష్ప్రభావాల నుండి విద్యార్థులను రక్షించడానికి.. విద్యార్థుల ఆరోగ్యం, శ్రేయస్సు నిర్ధారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు.

అసోంలో హీట్ వేవ్

ఇకపోతే, అసోం వ్యాప్తంగా హీట్ వేవ్ తో ప్రజలు అల్లాడిపోతున్నారు. పాఠశాలల సమయాల మార్చేందుకు అనేక ప్రాంతాల్లోని విద్యాధికారులు కూడా నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఎండతీవ్రత వల్ల విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడటానికి అసోం ప్రభుత్వం పాఠశాల వేళల్లో మార్పులతో అసోం విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది.


Similar News