యూసీసీ ముసాయిదా బిల్లుకు ఉత్తరాఖండ్ క్యాబినెట్ ఆమోదం

దిశ, నేషనల్ బ్యూరో : అన్ని వర్గాల ప్రజలకు ఒకేవిధమైన చట్టాలను అమల్లోకి తెచ్చేందుకు ఉద్దేశించిన యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) ముసాయిదా బిల్లుకు ఉత్తరాఖండ్ క్యాబినెట్ ఆమోదించింది.

Update: 2024-02-04 15:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అన్ని వర్గాల ప్రజలకు ఒకేవిధమైన చట్టాలను అమల్లోకి తెచ్చేందుకు ఉద్దేశించిన యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) ముసాయిదా బిల్లును ఉత్తరాఖండ్ క్యాబినెట్ ఆమోదించింది. ఆదివారం డెహ్రాడూన్‌లో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి ఐదుగురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులతో కూడిన యూసీసీ ముసాయిదాకు పచ్చజెండా ఊపింది. ఫిబ్రవరి 5(సోమవారం) నుంచి 8 (గురువారం) వరకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మంగళవారం రోజున (ఫిబ్రవరి 6న) రాష్ట్ర అసెంబ్లీలో యూసీసీ ముసాయిదాను ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఒకవేళ ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే.. స్వాతంత్య్రానంతరం యూనిఫాం సివిల్ కోడ్‌ను ఆమోదించిన దేశంలోని తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుంది. రాష్ట్రంలో మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ ఏకరీతి వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాల కోసం న్యాయబద్ధమైన మార్గదర్శకాలను అందించడం ఈ బిల్లు లక్ష్యం. ఈ ముసాయిదా బిల్లును సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ రూపొందించింది.

యూసీసీ ముసాయిదాలోని కీలక సిఫారసులు..

* బహుభార్యత్వం, బాల్య వివాహాలపై పూర్తి నిషేధం విధిస్తారు.

* అన్ని మతాలకు చెందిన బాలికలకు ఒకే విధమైన కనీస వివాహ వయస్సును నిర్ణయిస్తారు.

* విడాకుల కోసం అన్ని వర్గాల వారికి ఒకే విధమైన కారణాలు, విధానాలను అమలు చేస్తారు.

Tags:    

Similar News