BREAKING: ఉత్తర కాశీ టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్.. 41 మంది కార్మికులు సేఫ్
ఉత్తరఖాండ్‌లోని ఉత్తర కాశీ టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. టన్నెల్‌లో చిక్కకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. టన్నెల్ నుండి
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరఖాండ్‌లోని ఉత్తర కాశీ టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. టన్నెల్‌లో చిక్కకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. టన్నెల్ నుండి కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తీసుకువస్తున్నారు. కార్మికులందరిని బయటకు తీసుకువచ్చేందుకు గంట నుండి రెండు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. కార్మికులు సొరంగం నుండి బయటకు రాగానే వైద్య సదుపాయాలు తక్షణమే అందించేలా ఘటన స్థలం వద్దనే అధికారులు అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. రెస్య్కూ ఆపరేషన్ చివరి స్టేజ్‌లో ఉండటంతో ఉత్తరఖాండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ టన్నెల్ వద్దకు చేరుకున్నారు.
కాగా, ఉత్తరకాశీ సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు దాదాపు 17 రోజుల నుంచి సహయక చర్యలు జరుగుతున్నాయి. సొరంగంలో కూలిన శిథిలాలను భారీ యంత్రాలతో 58 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేసుకుంటూ రెస్క్యూ టీమ్స్ ముందుకు వెళ్లాయి. ర్యాట్ హోల్ పద్దతిలో రెస్య్కూ ఆపరేషన్ చేపట్టిన సహయక బృందాలు ఎట్టకేలకు ఇవాళ కార్మికుల ఉన్న ప్రదేశం వరకు డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్లారు. సొరంగంలో ఉన్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు 5గురు రెస్య్కూ టీమ్ సిబ్బంది టన్నెల్‌లోకి వెళ్లారు. కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తీసుకువస్తున్నారు. 41 మంది కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కార్మికుల కుటుంబ సభ్యులు, అధికారులు అంతా ఊపీరి పీల్చుకున్నారు.