UPSC: వివాదాస్ప ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్ కర్ ఎంపిక రద్దు

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్ కర్ ఎంపిక రద్దయ్యింది. అలానే భవిష్యత్ లోయూపీఎస్సీ పరీక్షలు రాయకుండా శాశ్వతంగా నిషేధం విధించినట్లు ప్రకటించింది.

Update: 2024-07-31 10:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్ కర్ ఎంపిక రద్దయ్యింది. ఆమె తన పేరు, తండ్రి, తల్లి పేరు, మొబైల్ నంబర్, చిరునామాను మార్చడం, నకిలీ గుర్తింపు.. ఇలా అన్నింటినీ మోసపూరితంగా పొందినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పేర్కొంది. ఆమెని దోషిగా నిర్ధారిస్తూ ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. అలానే భవిష్యత్ లోయూపీఎస్సీ పరీక్షలు రాయకుండా శాశ్వతంగా నిషేధం విధించినట్లు ప్రకటించింది.

షోకాజ్ నోటీసులు

జులై 18న పూజా ఖేడ్ కర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు యూపీఎస్సీ తెలిపింది. నకిలీ గుర్తింపుతో పరీక్షా నిబంధనలకు వ్యతిరేకంగా పరిమితికి మించి ప్రయత్నాలు చేసిందని పేర్కొంది. షోకాజ్ నోటీసులకు జులై 25లోగా స్పందన తెలియజేయాలని స్పష్టం చేశామంది. కానీ, పుజా ఆగస్టు 4 వరకు గడువు కోరిందని.. యూపీఎస్సీ జులై 30 వరకు సమయం ఇచ్చిందని వివరించింది. దీన్నే "చివరి అవకాశం" అని స్పష్టం చేసినట్లు పేర్కొంది. గడువులోగా స్పందన రాకపోతే చర్యలు తీసుకుంటామని ముందే హెచ్చరించినట్లు తెలిపింది. "ఆమెకు గడువు పొడిగించినప్పటికీ, ఆమె తన వివరణను నిర్ణీత సమయంలో సమర్పించడంలో విఫలమైంది" అని ప్యానెల్ ప్రకటనలో పేర్కొంది.

15వేల మంది అభ్యర్థుల డేటా పరిశీలన

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు పూజా ఖేడ్ కర్ ను యూపీఎస్సీ దోషిగా తేల్చింది. భవిష్యత్ లో జరిగే అన్ని పరీక్షల నుంచి శాశ్వతంగా డిబార్ చేసినట్లు వెల్లడించింది. 2009 నుంచి 2023 మధ్య ఐఏఎస్ స్క్రీనింగ్ క్లియర్ చేసిన 15,000 మందికి పైగా అభ్యర్థుల డేటాను పరిశీలించినట్లు ప్యానెల్ తెలిపింది. పుజా మినహా ఎవరూ ఎక్కువ ప్రయత్నాలు చేయలేదంది. యూపీఎస్సీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)నే ఫాలో అయ్యిందని తెలిపింది. అయితే, ఆమె తన పేరును మాత్రమే కాకుండా తల్లిదండ్రుల పేరును కూడా మార్చిందని పేర్కొంది. అందుకే, ఆమె చేసిన ప్రయత్నాల సంఖ్యను గుర్తించలేకపోయామంది.

Read More..

BREAKING: నగర శివార్లలో రేవ్ పార్టీ కలకలం.. వివాదంలో బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్ షేక్‌..! 


Similar News