Arrest : పాకిస్తాన్‌లో యూపీ యువకుడు అరెస్ట్.. కారణమిదే..!
పాకిస్తాన్ బార్డర్ దాటిన యూపీ యువకుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ బార్డర్ దాటిన యూపీ యువకుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని యూపీ అలిగఢ్ జిల్లాకు చెందిన బాదల్ బాబు(30)గా గుర్తించారు. పాకిస్తాన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫేస్‌బుక్‌లో ఓ యువతితో సదరు యువకుడు ప్రేమలో పడ్డాడు. ఆమెను నేరుగా కలిసేందుకు ఎలాంటి వీసా, ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండా దేశంలోకి ప్రవేశించాడు. డిసెంబర్ 27న ఈ ఘటన జరగగా.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది. గతంలోనూ రెండు సార్లు భారత్-పాక్ బార్డర్లను నిందితుడు దాటేందుకు ప్రయత్నించి విఫలం అయినట్లు విచారణలో తేలింది. మూడో సారి అతను సరిహద్దు దాటాడు. నిందితుడు కేవలం ప్రేమ వ్యవహారం కారణంగానే బార్డర్ దాటాడా లేక ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టాం అన్నారు. 2024 జులైలో కూడా యూపీకి చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో పరిచమైన పాకిస్తాన్ మహిళను కలిసేందుకు వెళ్తుండగా బీఎస్ఎఫ్ అధికారులు అతడిని జమ్ము కశ్మీర్‌లోని కకోర్ ఔట్ పోస్ట్ వద్ద అరెస్ట్ చేశారు.