Potatoes SI : ‘5 కేజీల ఆలుగడ్డలు’ లంచంగా కోరిన ఎస్ఐ.. కానీ ఒక ట్విస్ట్ ఉంది..

ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్‌కి చెందిన ఓ ఎస్సై ‘5 కేజీల ఆలుగడ్డలు (బంగాళదుంప) లంచంగా ఇవ్వాలని కోరినందుకు సస్పెండ్ అయ్యాడు.

Update: 2024-08-10 13:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌కి చెందిన ఓ ఎస్సై ‘5 కేజీల ఆలుగడ్డలు (బంగాళదుంప) లంచంగా ఇవ్వాలని కోరినందుకు సస్పెండ్ అయ్యాడు. అదేంటి ఆలుగడ్డలు కూడా కొనుక్కోడానికి ఎస్ఐ వద్ద డబ్బుల్లేవు అని అనుకుంటున్నారా? లేదా ఇలా కూడా ఎవరైనా లంచం తీసుకుంటారా? అనుకుంటున్నారా? అది కాదు.. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అలుగడ్డలు అనే పదాన్ని లంచానికి కోడ్ వర్డ్‌గా ఉపయోగించాడు. వివరాల్లోకి వెళితే.. రామ్ కృపాల్ సింగ్ అనే పోలీస్ సారిఖ్ స్టేషన్ పరిధిలోని భావల్‌పూర్ చపున్నా చౌకీలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు.

ఓ కేసును పరిష్కరించేందుకు బాధితుడి నుంచి ఆయన లంచం డిమాండ్ చేశారు. బాధితుడు అయిన రైతును ఎస్ఐ ‘5 కేజీల ఆలుగడ్డలు’ లంచంగా కావాలని కోరాడు. అయితే రైతు 2 కిలోలు మాత్రమే ఇచ్చాడు. దానికి ఎస్ఐ అంగీకరించలేదు. చివరికి 3 కిలోల ఆలుగడ్డలకు ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించిన సంభాషణల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. డబ్బుల కోసం ఆలుగడ్డల్ని కోడ్ వర్డ్‌గా వాడినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఎస్ఐని సస్పెండ్ చేస్తూ కన్నౌజ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కేసుపై శాఖపరమైన విచారణ చేపట్టారు.

Tags:    

Similar News