రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్

రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Update: 2024-08-05 09:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాక ప్రధానమంత్రులందరి ప్రసంగాలు చదవాలని భావించాను. రైతులు కాంగ్రెస్‌కు ఎన్నడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ నరేంద్రమోడీ భారత ప్రధాని అయినప్పుడు తన ప్రసంగాలలో రైతుల గురించి మాట్లాడారు. ప్రధాని మోడీ హృదయంలో రైతు సంక్షేమం ఉంది. అందుకే అతను రైతుల గురించి మాట్లాడతాడు. కానీ  1988లో ఢిల్లీలో ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా మీరట్‌లో రైతులపై కాల్పులు జరిపి.. ఐదుగురు రైతుల మరణాలకు కారణం అయ్యారని గుర్తు చేశారు. 'పెద్ద యాత్రలు నిర్వహించే ఓ నాయకుడు..ఓ యాత్రలో హర్యానాలోని సోనిపట్‌కు వెళ్లాడు. ఆ యాత్రలో రైతుల కంటే కెమెరామెన్‌లే ఎక్కువ ఉంటారు. వారంత కలిసి రైతులతో మా నాయకుడు మమేకం అయినట్లు రీల్స్ తయారు చేస్తారని హెలన చేశారు. అలాగే పచ్చి మిర్చి కంటే మిర్చి ధర ఎక్కువ అంటూ రైతులతో మాట్లాడాడు అని.. రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. 

Tags:    

Similar News