Charuhasan : దీపావళి ఎమర్జన్సీ వార్డులో గడిచిపోయింది : సీనియర్ నటి సుహసిని
తమ కుటుంబం ఎంతో సంబరంగా జరుపుకోవాల్సిన దీపావళి(Diwali)ఈసారికి ఎమర్జన్సీ వార్డులో గడిచిపోయిందని భావోద్వేగానికి గురయ్యారు సీనియర్ నటి సుహసిని.
దిశ, వెబ్ డెస్క్ : తమ కుటుంబం ఎంతో సంబరంగా జరుపుకోవాల్సిన దీపావళి(Diwali)ఈసారికి ఎమర్జన్సీ వార్డులో గడిచిపోయిందని భావోద్వేగానికి గురయ్యారు సీనియర్ నటి సుహసిని. ప్రముఖ నటుడు కమల్ హాసన్(Kamal Haasan) సోదరుడు చారుహాసన్(Charuhasan) అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని చారుహాసన్ కూతురు నటి సుహాసిని(Suhasini) వెల్లడించారు. దీపావళికి ముందు తన తండ్రి అస్వస్థతకు గురయ్యారని పోస్ట్ పెట్టారు. తమ దీపావళి ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది అంటూ ఎమోషనల్ అయ్యారు. గురువారం రాత్రి ఆయన అనారోగ్యానికి గురవడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన సర్జరీకి సిద్ధమవుతున్నారని సుహాసిని తన పోస్టులో తెలిపారు. నేడు ఆయనకు శస్త్రచికిత్స చేయనున్నట్లు సమాచారం.
93 ఏళ్ల చారు హాసన్ ఈ ఏడాది ఆగస్టులోనే వయోభారంతో కూడిన ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు సుహాసిని, సుభాషిని, నందిని ఉన్నారు. చారుహాసన్ తమిళంతో పాటు పలు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించారు. కన్నడ హిట్ మూవీ తబరన కథ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన 'హర అనే తమిళ చిత్రంలో కన్పించారు. చారుహాసన్ అభిమానులు ఆయన త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి రావాలని ప్రార్ధనలు చేస్తున్నారు.