Madhya Pradesh:వారంలో పది ఏనుగులు మృత్యువాత.. కారణం ఏంటంటే?

మధ్యప్రద్రేశ్‌(Madhya Pradesh)లో ఏనుగుల వరుస మరణాలు కలకలం రేపుతోంది.

Update: 2024-11-01 05:24 GMT

దిశ,వెబ్‌డెస్క్: మధ్యప్రద్రేశ్‌(Madhya Pradesh)లో ఏనుగుల వరుస మరణాలు కలకలం రేపుతోంది. MPలోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్(BTR)(Bandhavgarh Tiger Reserve)లో ఈ వారంలోనే 10 ఏనుగులు మృత్యువాత పడటం సంచలనంగా మారింది. మృతి చెందిన ఏనుగుల్లో మూడు ఏళ్ల వయస్సు ఏడు ఆడ ఏనుగులు.. మరొక నాలుగు ఏళ్ల వయసున్న మగ ఏనుగు ఉన్నాయి. అయితే వీటి మరణాలకు సంబంధించి అనుమానాస్పదంగా ఏమీ కనిపించడం లేదని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అంబాదే తెలిపారు. మృతి చెందిన ఏనుగుల మల పదార్థం, మట్టి, సమీపంలోని మొక్కల నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు.

పోస్టుమార్టం(Postmortem), ఫోరెన్సిక్ నివేదిక(Forensic report) తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ ఘటనలపై దర్యాప్తు చేసేందుకు ఢిల్లీకి చెందిన వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో(Wildlife Crime Control Bureau) అధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో NTCA (National Tiger Conservation Authority)కి చెందిన ముగ్గురు సభ్యుల బృందం బాంధవ్‌గఢ్‌లో పర్యటిస్తోంది. మరోవైపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌(Chief Conservator of Forest)లతో కూడిన ఐదుగురు సభ్యుల బృందం స్వతంత్ర విచారణ చేపట్టింది. విచారణ నివేదికను 10 రోజుల్లో సమర్పించనుంది. ఏనుగుల మృతికి ప్రాథమిక కారణం పాయిజన్‌గా అధికారులు అనుమానిస్తురు. ఏనుగుల కళేబరాలు లభ్యమైన ప్రాంతాల్లోని పొలాలు, ఇళ్లలో వన్యప్రాణి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News