Budget 2023 Live Updates : భారత్ నేడు తలెత్తుకొని నిలబడుతోంది: Nirmala Sitharaman

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు.

Update: 2023-02-01 05:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. వరుసగా ఐదోసారి నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కాగా, ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది చివరిసారి పూర్తి స్థాయి బడ్జెట్ కావడం గమనార్హం. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ప్రపంచ మంతా భారతదేశం వైపు చూస్తోందని అన్నారు. దేశ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు పెరిగాయని తెలిపారు. సమిష్టి ప్రగతి దిశగా దేశం వేగవంతంగా అడుగులు వేస్తోందని వెల్లడించారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. దేశ వ్యాప్తంగా దాదాపు 103 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల ఎదుట భారత్ తలెత్తుకొని నిలబడుతోందని అభిప్రాయపడ్డారు. భారత దేశానికి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని వెల్లడించారు. ఈపీఎఫ్‌లో సభ్యుల సంఖ్య పెరిగిందని అన్నారు.

ఇవి కూడా చదవండి:   Budget 2023 Live Updates : కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ దేశవ్యాప్త ప్రచారం 

Tags:    

Similar News