Chirag Paswan : కులగణన ఆధారంగానే ప్రభుత్వ పథకాలుండాలి : కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ (రాంవిలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-25 14:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ (రాంవిలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణనను తాను తప్పకుండా సమర్ధిస్తానని ఆయన పునరుద్ఘాటించారు. కులగణన సమాచారం ఆధారంగా ప్రభుత్వ విధానాల రూపకల్పన జరగాల్సిన అవసరం ఉందనే వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం రోజు జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన ఎల్‌జేపీ (రాంవిలాస్) జాతీయ కార్యవర్గ సమావేశంలో చిరాగ్ పాశ్వాన్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకున్నారు.

‘‘కులగణన ఆధారంగా అన్ని కులాల జనసంఖ్యపై ప్రభుత్వాలు పూర్తి స్పష్టత రావాలి. దాని ఆధారంగా ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలకు రూపకల్పన జరగాలి. బడ్జెట్ కేటాయింపులకూ దాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలి. వెనుకబడిపోయిన కులాలను ముందంజలోకి తెచ్చేందుకు కులగణన బాటలు వేస్తుంది’’ అని ఈసందర్భంగా చిరాగ్ పాశ్వాన్‌ పేర్కొన్నారు.


Similar News