పట్టు బిగించిన ఎన్ఐఏ.. లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్‌మోల్‌పై ఎన్‌ఐఏ రూ.10 లక్షల రివార్డు
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై కంప్లీట్ ఫోకస్ పెట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అతడి సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై ఏకంగా రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది.
దిశ, వెబ్‌డెస్క్: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై కంప్లీట్ ఫోకస్ పెట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అతడి సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై ఏకంగా రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. అన్మోల్ బిష్ణోయ్ (Anmol Bishnoi) అలియాస్ భాను కూడా పేరు మోసిన గ్యాంగ్‌స్టర్. ఇటీవల హత్యకు గురైన కాంగ్రెస్ లీడర్ బాబా సిద్దీకి మర్డర్, గాయకుడు, రాజకీయ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యలతో పాటు మరో 17 క్రిమినల్ కేసుల్లో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుల్లో హంతకులుగా ఉన్న వ్యక్తులతో అతడు ఓ మెసేజింగ్ యాప్‌లో చాట్ చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. సల్మాన్ ఖాన్ (Salman Khan)ను కూడా చంపేస్తామని బెదిరించినవారిలో అతడికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్‌ఐఏ 2023లో అతడిపై చార్జిషీటు దాఖలు చేసింది.
అయితే అన్మోల్ ఇప్పటికే నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుండి పారిపోయాడని, అతడు ఎప్పటికప్పుడు తన లొకేషన్‌లను మారుస్తూ దొరక్కుండా తిరుగుతున్నాడని, గత సంవత్సరం కెన్యాలో కనిపించిన అన్మోల్.. ఈ సంవత్సరం కెనడాలో కనిపించాడని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఇక అన్మోల్ ఇప్పటికే ఓ కేసులో దోషిగా జోధ్‌పూర్ జైలులో శిక్ష కూడా అనుభవించాడు. అయితే 2021 అక్టోబర్ 7న బెయిల్‌పై విడుదలైన అతడు ఆ తర్వాత నుంచి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.