మీడియా అప్రమత్తంగా ఉండాలి.. కేంద్రం సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్
కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కొచ్చి: కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ సమగ్రతకు ముప్పు కలిగించే కథనాల ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం మీడియాను హెచ్చరించారు. శనివారం మళయాలం డెయిలీ మాతృభూమి శతాబ్ది వేడుకల్లో ప్రసంగించారు. దేశంలోని మీడియా సహోదరులు జాగ్రత్తగా ఉండాలని, దేశ సమగ్రతకు ముప్పు కలిగించే కథనాలకు చోటు కల్పించకుండా ఉండాలని కోరారు.
నాసిరకం, అశాస్త్రీయమైన అభిప్రాయాలు ఎక్కడినుంచైనా ఉచితంగా వస్తాయని.. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వాస్తవాలు పవిత్రమైనవని.. ఎలాంటి అభిప్రాయం లేనివనే ఇంగ్లీష్ సామెతను చెప్పారు. దేశ ప్రజాస్వామ్య స్వభావం ఎల్లప్పుడూ వాస్తవంగా ఉంటుందని నొక్కి చెప్పారు.