రాష్ట్రాలకు పన్ను నిధులను విడుదల చేసిన కేంద్రం
దేశంలోని పలు రాష్ట్రాలకు రావాల్సిన 3వ విడత పన్ను నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
దిశ, వెబ్ డెస్క్: దేశంలోని పలు రాష్ట్రాలకు రావాల్సిన 3వ విడత పన్ను నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి పన్ను వాటా కింద రూ.2,486 కోట్లు రాగా.. ఆంధ్రప్రదేశ్ కు రూ.4,787 కోట్లు నిధులు కేటాయించారు. ఇక ఉత్తర ప్రదేశ్ 21,218 కోట్ల అత్యధిక నిధులు దక్కించుకోగా.. గోవాల కేవలం రూ.457 కోట్ల నిధులను మాత్రమే పొందింది. ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక రూ.4,314 కోట్లు, రాజస్థాన్ రూ.7,128 కోట్లు, చత్తీస్ గఢ్ రూ.4,030 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ రూ.982 కోట్ల నిధులను పొందాయి.