బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అఖిలేష్ యాదవ్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Update: 2023-02-01 11:28 GMT

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌లో ఆశ లేదని.. అంతా నిరాశే ఉందని పేర్కొన్నారు. మునుపటి బడ్జెట్‌కు ఈ బడ్జెట్‌కు పెద్ద తేడా ఏమీ లేదని చెప్పారు. ఈ బడ్జెట్ వల్ల మున్ముందు ద్రవోల్బణం, నిరుద్యోగం పెరుగుతాయని పేర్కొన్నారు. 'బీజేపీ తన బడ్జెట్లతో దశాబ్ద కాలాన్ని పూర్తి చేసింది. గతంలోనే జనాలకు ఏమీ ఇవ్వని ఈ ప్రభుత్వం ఇప్పుడేమిస్తుంది? ఈ బడ్జెట్ వల్ల ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతాయి. ఈ బడ్జెట్ ప్రజల్లో ఆశలు నింపలేదు.. రైతులు, కూలీలు, యువత, మహిళలు, ప్రొఫెషనల్స్, వ్యాపారస్తులకు నిరాశే మిగిల్చింది. ఈ బడ్జెట్ కొద్ది మంది ధనవంతులకు మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది' అని అఖిలేష్ అన్నారు.

Tags:    

Similar News