ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్య పరిణామం.. మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ మరోసారి విచారణకు పిలిచింది.

Update: 2023-02-18 06:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ మరోసారి విచారణకు పిలిచింది. ఫిబ్రవరి 19న ఉదయం ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ లో విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు పలువురు ప్రముఖ రాజకీయ నేతలు, వ్యాపార వేత్తల పేర్లు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో సిసోడియాను మరోసారి విచారణకు పిలిపించడం సంచలనంగా మారుతోంది. అసలీ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ప్రధాన నిందితుడిగా అప్పటి ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేసిన మనీష్ సిసోడియాను ఏ1 ముద్దాయిగా పేర్కొంది.

అయితే ఆ తర్వాత సీబీఐ నమోదు చేసిన చార్జీషీట్ లో అనూహ్యంగా మనీష్ సిసోడియా పేరు కనిపించలేదు. ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ లోనూ ఆయన పేరు ప్రస్తావించలేదు. ఈ క్రమంలో ఈ కేసు విచారణలో భాగంగా సిసోడియా నివాసం, కార్యాలయం, బ్యాంక్ లాకర్లను దర్యాప్తు సంస్థ తనిఖీలు చేపట్టగా తనకు వ్యతిరేకంగా ఎలాంటి సమాచారం కనుగోలేకపోయారని అప్పట్లో సిసోడియా వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల నిందితులు దాఖలు చేసిన బెయిల్ ను ప్రత్యేక కోర్టు క్యాన్సిల్ చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి మనీష్ సిసోడియాను విచారణకు రావాల్సిందిగా సీబీఐ పిలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కాగా, తనకు అందిన నోటీసులపై మనీష్ సిసోడియా శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీబీఐ మరోసారి తనను పిలించిందని విచారణకు పూర్తిగా సహకరిస్తాననని పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా సీబీఐ, ఈడీ పూర్తి అధికారాన్ని ఉపయోగిస్తోంది. గతంలో తన ఇల్లు, కార్యాలయం, లాకర్లలో సోదాలు చేపట్టినా ఎలాంటి సాక్షాలు పట్టుకోలేకపోయారని ఈ సారి విచారణకు కూడా తాను సహకరిస్తానని చెప్పారు. ఢిల్లీలోని విద్యార్థులకు మంచి చదువు చెప్పే ఏర్పాట్లు చేశానని, కానీ దర్యాప్తు సంస్థలు తనను ఆపాలనుకుంటున్నారని ఈ సందర్భంగా కామెంట్ చేశారు.

Tags:    

Similar News