భద్రతా మండలిని సంస్కరించాల్సిందే : ఐరాస జనరల్ అసెంబ్లీ చీఫ్
దిశ, నేషనల్ బ్యూరో : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలనే డిమాండ్‌పై ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలనే డిమాండ్‌పై ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రతామండలి ప్రస్తుత కూర్పు ప్రపంచంలోని సమకాలీన భౌగోళిక, రాజకీయ వాస్తవికతను ప్రతిబింబించడం లేదన్నారు. సెక్యూరిటీ కౌన్సిల్‌లో సంస్కరణలు చేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐదు రోజుల భారత పర్యటన కోసం బుధవారం ఢిల్లీకి చేరుకున్న డెన్నిస్ ఫ్రాన్సిస్.. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి భద్రతల బలోపేతానికి అవసరమైన నిర్ణయాలను ఇటీవల కాలంలో భద్రతా మండలి తీసుకోలేకపోయిందన్నారు.