Pinaka : టాటా, ఎల్‌అండ్‌టీ రాకెట్లతో ‘పినాక’ పరీక్ష సక్సెస్
దిశ, నేషనల్ బ్యూరో : ‘పినాక’ గైడెడ్ రాకెట్ వ్యవస్థను భారత్(India) మరోసారి విజయవంతంగా పరీక్షించింది.
దిశ, నేషనల్ బ్యూరో : ‘పినాక’ గైడెడ్ రాకెట్ వ్యవస్థను భారత్(India) మరోసారి విజయవంతంగా పరీక్షించింది. గురువారం రోజు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలో వేర్వేరు ప్రదేశాల్లో మూడు దశల్లో ‘పినాక’ రాకెట్లను(Pinaka Rocket System) ప్రయోగించి పరీక్షించారు. ఇందుకోసం టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, లార్సెన్ అండ్ టబ్రో(ఎల్‌అండ్‌టీ) తయారు చేసిన చెరో 12 రాకెట్లను వినియోగించారు. అధునాతన టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేసిన పినాక లాంఛర్ల నుంచి రాకెట్లను ప్రయోగించారు.
రాకెట్లు ఎంత దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తున్నాయి ? లక్ష్యాన్ని ఎంతమేర కచ్చితత్వంతో తాకుతున్నాయి ? ఒకేసారి ఒకటికి మించి రాకెట్లను శత్రు లక్ష్యాల దిశగా ప్రయోగించినప్పుడు వాటి పనితీరు ఎలా ఉంటోంది ? అనే అంశాలను పినాక(Pinaka) రాకెట్ వ్యవస్థను పరీక్షించే క్రమంలో నిపుణులు నమోదు చేశారు. ఈ టెస్టింగ్‌కు సంబంధించిన ఒక వీడియోను రక్షణ శాఖ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. పినాక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసినందుకు డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, ఆర్మీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు.