BREAKING: యూజీసీ నెట్-2024 పరీక్ష రద్దు

దేశ వ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ఇష్యూ తీవ్ర దుమారం రేపుతోన్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం దేశవ్యాప్తంగా జరిగిన యూజీసీ

Update: 2024-06-19 17:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ఇష్యూ తీవ్ర దుమారం రేపుతోన్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం దేశవ్యాప్తంగా జరిగిన యూజీసీ నెట్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. మంగళవారం జరిగిన నెట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు వచ్చిన సమాచారం మేరకు పరీక్ష క్యాన్సిల్ చేసినట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఈ మేరకు యూజీసీ నెట్‌ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. పారదర్శకతను కాపాడటం కోసమే నెట్ పరీక్షను చేసినట్లు కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. నెట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ ఇష్యూపై సీబీఐ విచారణ జరిపించాలని సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ఈ మేరకు సీబీఐ నెట్ పేపర్ లీకేజీపై దర్యాప్తు చేపట్టనుంది.


Similar News