UGC NET 2023 ఈ రోజే చివరి తేదీ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) జూన్ 2023 కోసం దరఖాస్తు ప్రక్రియకు ఈరోజు, మే 31, మే 31న ముగియనుంది.
దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) జూన్ 2023 కోసం దరఖాస్తు ప్రక్రియకు ఈరోజు, మే 31, మే 31న ముగియనుంది. వివిధ కోర్సుల్లో PhD ప్రోగ్రామ్ చేయాలనుకునే వారు యూజీసీ నెట్ కచ్చితంగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. దీంతో ఈ పరీక్ష అప్లై చేయడానికి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉందని.. NTA స్పష్టం చేసింది. UGC NET జూన్ 2023 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ugcnet.nta.nic.in మరియు nta.ac.inలో అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకొవచ్చని.. అలాగే తమ అప్లికేషన్లను జూన్ 2, 3 తేదీల్లో ఎడిట్ చేసుకొవచ్చని తెలిపింది.
UGC నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 13 నుండి జూన్ 22 వరకు నిర్వహించబడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం అభ్యర్థుల అర్హతను నిర్ణయించడానికి ఈ పరీక్ష జరుగుతుంది. UGC NET జూన్ సెషన్ మొత్తం 83 సబ్జెక్టులలో నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష విధానం పూర్తిగా కంప్యూటర్ ఆధారితంగా ఉంటుందని ఎన్టీఏ తెలిపింది.