Encounter: అనంత్‌నాగ్‌లో ఎన్ కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదులు హతం.. కొనసాగుతున్న కాల్పులు

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌( Anantnag)లో శనివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌(Encounter:)లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Update: 2024-11-02 08:33 GMT

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌( Anantnag)లో శనివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌(Encounter:)లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పులు శ్రీనగర్‌కు 57 కిలోమీటర్ల దూరంలో జరిగినట్లు తెలుస్తుంది. అనంత్‌నాగ్( Anantnag) లోని కచ్వాన్ లోని హల్కన్ గలీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో వారి కాల్పులు సమర్ధవంతంగా తిప్పికొట్టిన బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఆ ప్రాంతంలో మరికొంత మంది ఉగ్రవాదులు( terrorists) ఉండవచ్చనే అనుమానంతో ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు(Security forces) జల్లెడ పడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన దాడులను సీరియస్ గా తీసుకున్న కేంద్రం.. జమ్మూలో అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్(Anti-terror operation) ప్రారంభించాయి. ఇందులో భాగంగా.. శనివారం ఉదయం.. భద్రతా బలగాలు జమ్మూ (Jammu)ప్రాంతంలోని 30కి పైగా ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల(Anti-terror operation)ను ప్రారంభించాయి. దోడా, కిష్త్వార్, పూంచ్, రాజౌరి ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు.


Similar News