Diwali : దీపావళి తరువాతి రోజు ఉజ్జయినిలో వింత ఆచారం

భారతదేశంలో దీపావళి ఉత్సవాలు(Diwali celebrations) ఘనంగా జరుగుతాయి.

Update: 2024-11-02 10:28 GMT

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశంలో దీపావళి ఉత్సవాలు(Diwali celebrations) ఘనంగా జరుగుతాయి. బాణాసంచా మోతలతో ఊరూ వాడా దద్దరిల్లిపోయాయి. దీపాల వెలుగులో ప్రతి ఇళ్ళు, ప్రతి వీధి కళకళలాడిపోయాయి. అయితే దేశంలోని చాలా చోట్ల దీపావళి పండుగ తర్వాత మరికొన్ని ఉత్సవాలు, ఆచారాలు జరుపుతారు. తెలంగాణలో దీపావళి తరువాతి రోజు దున్నపోతుల ఆటలతో 'సదర్'(Sadar) ఉత్సవాలను వైభవంగా జరుపుతారు. అలాగే మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని(Ujjain)లో కూడా దీపావళి తరువాతి రోజు ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు. నగర సమీపంలోని భిదద్వాడ్ గ్రామంలో పండగ మరుసటిరోజు గోవర్ధన పూజ(Govardhana Pooja) జరిపిన అనంతరం ఆ గ్రామానికి చెందిన యువకులంతా వీధిలో బోర్లా పడుకొని ఆవుల మందతో తొక్కించుకుంటారు. దీనివలన తాము ఏడాది మొత్తం చేసిన తప్పులు క్షమించబడతాయని, మంచి జరుగుతుందని గ్రామ ప్రజలు బలంగా నమ్ముతారు.   

Tags:    

Similar News