రన్‌వేపై రెండు విమానాలు ఢీ.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌‌లో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం రన్‌వేలోకి ప్రవేశించడానికి క్లియరెన్స్ కోసం వేచి ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని ఇండిగో విమానం రెక్క కొన తగిలింది.

Update: 2024-03-27 12:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌‌లో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం రన్‌వేలోకి ప్రవేశించడానికి క్లియరెన్స్ కోసం వేచి ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని ఇండిగో విమానం రెక్క కొన తగిలింది. దీంతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం రెక్కలో కొంత భాగం రన్‌వేపై పడగా, ఇండిగో విమానం రెక్కలు తెగిపోయాయి. ఈ ఘటన సమయంలో ఇండిగో విమానంలో నలుగురు చిన్నారులు సహా 135 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కి నివేదిక సమర్పించినట్లు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఇద్దరు పైలట్లను విధుల నుంచి తొలగించారు, గ్రౌండ్ స్టాఫ్‌ను కూడా విచారించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన కారణంగా ఆలస్యం అయినందున ప్రయాణీకులందరికీ భోజనాలు అందించి, ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసినట్లు ఇండిగో పేర్కొంది.


Similar News