Jammu Kashmir: కశ్మీర్‌లో వలసకార్మికులపై టెర్రరిస్టుల కాల్పులు

జమ్ము కశ్మీర్‌లోని బుడ్గాం జిల్లాలో ఇద్దరు వలస కార్మికులను ఉగ్రవాదులు లక్ష్యం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల సోఫియాన్, 25 ఏళ్ల ఉస్మాన్ మాలికపై శుక్రవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

Update: 2024-11-01 16:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ము కశ్మీర్‌(Jammu Kashmir)లోని బుడ్గాం జిల్లా(Budgam Dist)లో ఇద్దరు వలస కార్మికుల(Migrant Workers)ను ఉగ్రవాదులు లక్ష్యం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల సోఫియాన్, 25 ఏళ్ల ఉస్మాన్ మాలికపై శుక్రవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వారిని వెంటనే శ్రీనగర్‌లోని బెమినా జేవీసీ హాస్పిటల్‌లో చేర్పించగా.. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిసింది. జలశక్తి శాఖ కింద సోఫియాన్, ఉస్మాన్‌లో రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు. సెంట్రల్ కశ్మీర్‌లో స్థానికేతరులను 12 రోజుల క్రితమే లక్ష్యం చేసుకున్నారు. గందర్బాల్ జిల్లాలో ఓ టన్నెల్‌ పనులు చేస్తున్నవారిపై టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఓ వైద్యుడు, ఆరుగురు వలస కార్మికులు మరణించారు. బుడ్గాంలో శుక్రవారం కాల్పులు జరగ్గానే ముష్కరుల కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

Tags:    

Similar News