75 ఏళ్ల తర్వాత కలుసుకున్న అన్నదమ్ములు.. ఈసారి శాశ్వతంగా విడిపోయారు

సాధిక్, సిక్కా ఖాన్ ఇద్దరూ అన్నదమ్ములు. 1947లో జరిగిన దేశ విభజన తర్వాత ఈ ఇద్దరు అన్నదమ్ములు విడిపోయారు.

Update: 2023-07-09 02:29 GMT

దిశ, వెబ్ డెస్క్: సాధిక్, సిక్కా ఖాన్.. ఇద్దరూ అన్నదమ్ములు. 1947లో జరిగిన దేశ విభజన తర్వాత ఈ ఇద్దరు అన్నదమ్ములు విడిపోయారు. సాధిక్ పాకిస్తాన్ కు వెళ్లిపోగా.. సిక్కా ఖాన్ ఇండియాలో స్థిరపడ్డాడు. ఆ తర్వాత 75 ఏళ్లపాటు వాళ్లు ఏనాడు కలుసుకోలేదు. కానీ ఈ ఏడాది జనవరిలో అన్నదమ్ములిద్దరూ  కర్తార్ పూర్ లో కలుసుకున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఇన్నేళ్ల తర్వాత కలుసుకోవడంతో బావోద్వేగానికి గురయ్యారు. అయితే తాజాగా సాధిక్, సిక్కా ఖాన్ అనే ఈ అన్నదమ్ములు శాశ్వతంగా విడిపోయారు. పాకిస్తాన్ లో ఉంటున్న సాధిక్ ఐదు రోజుల కిందట గుండెపోటుతో మృతి చెందాడు.

సోదరుడి మృతితో సిక్కా ఖాన్ కన్నీరుమున్నీరు అవుతున్నాడు. తాను చనిపోయేలాగా అన్నను మరోసారి చూడాలని ఆశపడ్డ సిక్కా ఖాన్ కు నిరాశే మిగిలింది. కాగా దేశ విభజన సమయంలో సాధిక్ తన నాన్నతో కలిసి పాకిస్తాన్ కు వెళ్లిపోగా.. సిక్కా ఖాన్ తన అమ్మతో కలిసి ఇండియాలోనే ఉండిపోయారు. ఇక ఇటీవల కలుసుకున్న ఈ అన్నదమ్ములు జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సాధిక్ ఇండియాకు వెళ్లడానికి వీసా ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరాడు. ఇంతలోనే ఆయన తనువు చాలించాడు. 

Tags:    

Similar News