Fake Tickets : ‘తండ్రితో కలిసి ఇంటికి వెళ్లాలనుకున్నా’ నకిలీ విమాన టికెట్లతో అరెస్ట్

నకిలీ విమాన టికెట్లతో లక్నో వెళ్లేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను పుణె ఎయిర్‌పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సలీం గోలేఖాన్, నసీరుద్దీన్ ఖాన్‌గా వారిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Update: 2024-08-12 12:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నకిలీ విమాన టికెట్లతో లక్నో వెళ్లేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను పుణె ఎయిర్‌పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సలీం గోలేఖాన్, నసీరుద్దీన్ ఖాన్‌గా వారిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఈ ఇద్దరు వ్యక్తులు నకిలీ టికెట్లతో పుణెలోని లోహెగావ్ ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించారు. నిందితుడు చెల్లుబాటు అయ్యే టికెట్‌, ఒక ఫేక్ టికెట్ తీసుకోని తన తండ్రితో కలిసి ఇండిగో విమానం ఎక్కేందుకు ప్రయత్నించారు. చెకింగ్ సమయంలో దొరికిపోయారు. దీంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది పోలీస్‌లకు అప్పగించారు. అనంతరం నిందితులపై విమంతల్ పోలీస్ ష్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.

సలీం తండ్రి పూణేకు వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, ఆదివారం తెల్లవారుజామున లక్నోకు రిటర్న్ ఫ్లైట్ టికెట్ బుక్ చేశారని ఇన్‌స్పెక్టర్ అజయ్ సంకేశ్వరి తెలిపారు. నిందితుడు తన తండ్రతో కలిసి ఇంటికి వెళ్లాలనుకున్నాడని వెల్లడించారు. అయితే తన తండ్రి కోసం టికెట్ బుక్ చేసిన ఏజెంట్ నుంచి నకిలీ టికెట్ పొందాడని, ఈ క్రమంలోనే ఎయిర్ లైన్ కౌంటర్లో టికెట్ నకిలీదని గుర్తించి పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. కాగా, ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు పోలీసులు ప్రారంభించారు.

Tags:    

Similar News