విశ్వాసం కోల్పోయాం- జ్ఞానవాపి మసీదులో పూజలపై స్పందించిన కమిటీ

జ్ఞాన్‌వాపి మసీదులో పూజకు అనుమతి ఇవ్వడంపై జమాతే ఇస్లామీ హింద్ స్పందించింది. జ్ఞానవాపి కేసులో తీర్పుతో విశ్వాసం కోల్పోయాం అన్నారు జమాతే ఇస్లామీ హింత్ ప్రెసిడెంట్ మహ్మద్ సలీం.

Update: 2024-02-03 09:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జ్ఞాన్‌వాపి మసీదులో పూజకు అనుమతి ఇవ్వడంపై జమాతే ఇస్లామీ హింద్ స్పందించింది. జ్ఞానవాపి కేసులో తీర్పుతో విశ్వాసం కోల్పోయాం అన్నారు జమాతే ఇస్లామీ హింత్ ప్రెసిడెంట్ మహ్మద్ సలీం. మసీదులో జరుగుతోంది ఒక వింత అని విమర్శించారు. ఏ వైపు జనం ఎక్కువగా ఉన్నారో కోర్టు చూస్తోందని చురకలు అంటించారు. దేశంలోని మతపరమైన స్థలాలు, సంస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఎల్ కే అద్వానీకి భారతరత్న ప్రకటనపైనా స్పందించారు వీపీ మొహతాసిమ్ ఖాన్. బాబ్రీ మసీదు కూల్చివేసిన వారికి రివార్డు ఇస్తామనేది ప్రభుత్వ వైఖరి అని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం తన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తోందన్నారు. కానీ ప్రభుత్వం చట్టప్రకారం పనిచేస్తుందో లేదో చూడాలన్నారు.

మరోవైపు, జ్ఞాన్‌వాపి మసీదు దక్షిణ సెల్లార్‌లో హిందువులు వప్రార్థనలు చేసుకోవడాకి వారణాసి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై స్టే విధించాలని మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించింది. ఉత్తర్వులపైస్టే విధించేందుకు హైకోర్టు తిరస్కరించింది.

Tags:    

Similar News