H-1B visas: హెచ్-1 బీ వీసాలపై మగా క్యాంపులో విభేదాలు.. మస్క్ కే ట్రంప్ మద్దతు
అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)కు హెచ్1 బీ (H1B Visa) వీసాల విషయంలో లొల్లి నడుస్తోంది. మస్క్ వర్సెస్ ట్రంప్ మద్దతుదారుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)కు హెచ్1 బీ (H1B Visa) వీసాల విషయంలో లొల్లి నడుస్తోంది. మస్క్ వర్సెస్ ట్రంప్ మద్దతుదారుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్టబద్ధమైన వలసలకు బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) మద్దతు ఇస్తున్నారు. కానీ, మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) బ్యాచ్ మాత్రం యూఎస్ ఫస్ట్ అనే నిబంధనకు కట్టుబడి ఉన్నారు. పరిణామాల మధ్య ట్రంప్ హెచ్-1బీ వీసా(H-1B) ప్రోగ్రామ్‌కు మద్దతును వ్యక్తం చేశారు. దీంతో, అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను యునైటెడ్ స్టేట్స్‌లోకి ప్రవేశించడానికి అనుమతిస్తుందన్నారు. “నేను ఎప్పుడూ హెచ్- 1బీ(H-1B) వీసాలను ఇష్టపడతాను. ఎప్పుడూ వీసాలకు అనుకూలంగా ఉంటాను. అందుకే మా వద్ద వీసాలు ఉన్నాయి’’ అని ట్రంప్ న్యూయార్క్ పోస్ట్‌తో అన్నారు.
లొల్లి ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే?
అయితే, ఈ లొల్లి మొదలవ్వడానికి ప్రధాన కారణం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా భారత సంతతికి చెందిన వెంచర్ క్యాపిటలిస్ట్, మస్క్ మిత్రుడైన శ్రీరామ్ కృష్ణన్‌ను నియమించడమే. శ్రీరామ్ కృష్ణన్ కు పదవి దక్కిన తర్వతా ట్రంప్ క్యాంపులో చీలకలు ఏర్పడ్డాయి. నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం గ్రీన్ కార్డ్‌లపై ఉన్న కంట్రీ క్యాప్‌లను తొలగించాలని.. గతంలో కృష్ణన్ బలంగా వాదించారు. కృష్ణన్ చేసిన ప్రకటనలపై ట్రంప్ మద్దతుదారులు విరుచుకుపడ్డారు. రైట్-వింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్, ఇమిగ్రేషన్ విమర్శకురాలు లారా లూమర్.. శ్రీరామ్ కృష్ణ్ నియామకాన్ని తప్పుబట్టారు. ఇది “తీవ్రంగా కలవరపరిచే” అంశం అని లేబుల్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఆమె విమర్శలు గుప్పించారు. దీనితో, ఎక్స్ వేదికగా రెండు వర్గాల మధ్య ఘర్షణ పీక్స్‌కు చేరుకుంది. అమెరికా నిర్మాణాన్ని వైట్ యురోపియన్లు చేశారు గానీ.. భారతదేశం నుండి వచ్చిన థార్డ్ వరల్డ్ వలసదారులు కాదంటూ.. లారా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, హెచ్-1బీపైనే వలసవచ్చిన ఎలన్ మస్క్‌తో సహా చాలా మంది లారా వ్యాఖ్యలపై మండిపడ్డారు. అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్‌లను ఆకర్షించాలనే ఆలోచనను స్థిరంగా కొనసాగించాలని మస్క్ ఎప్పటి నుండో వాదిస్తున్నారు. అమెరికన్ టెక్నాలజీ, ఆర్థిక ఆధిపత్యం అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ వ్యక్తులను నియమించుకో బట్టే వచ్చిందనీ… అమెరికా సామర్థ్యం దీనిపైన ఆధారపడి ఉందని మస్క్ మరోసారి ఎక్స్ వేదికగా వెల్లడించారు.