NASA Chief: నాసా చీఫ్‌గా మస్క్ బిజినెస్ ఫ్రెండ్..!

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా(NASA) తదుపరి చీఫ్ గా బిలియనీర్, ప్రైవేట్ ఆస్ట్రోనాట్ జేర్డ్ ఐజామెన్ నియామకం అయ్యారు.

Update: 2024-12-05 05:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా(NASA) తదుపరి చీఫ్ గా బిలియనీర్, ప్రైవేట్ ఆస్ట్రోనాట్ జేర్డ్ ఐజామెన్ నియామకం అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) .. తన పాలకవర్గంలో నియామకాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే నాసా చీఫ్ గా జేర్డ్ ఐజామెన్ ని నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపోతే, జేర్డ్ కు టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్తో (Elon Musk) వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి టైంలో జేర్డ్ ను నాసా చీఫ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘షిఫ్ట్4 పేమెంట్స్‌’ కంపెనీ సీఈవోగా ఉన్న 41 ఏళ్ల ఐజాక్‌మెన్‌ (Jared Isaacman).. స్పేస్‌ఎక్స్‌ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం, రాజకీయాలతో ఆయనకు పెద్దగా పరిచయాలు లేవు. కాకపోతే, జేర్డ్ కు రెండు సార్లు అంతరిక్షంలోకి వెళ్లిన అనుభవం ఉంది. అంతరిక్షంలో స్పేస్‌వాక్‌ చేసిన తొలి ప్రైవేట్‌ వ్యోమగామి (Private Astronaut)గా ఆయన గుర్తింపు సాధించారు.

Tags:    

Similar News