నేడు జాతీయ ఉల్లి దినోత్సవం
ప్రతీ యేటా జూన్ 27న జాతీయ ఉల్లి దినోత్సవం జరుపుకుంటారు.
దిశ, ఫీచర్స్ : ప్రతీ యేటా జూన్ 27న జాతీయ ఉల్లి దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక వంటకాల్లో ఉల్లిపాయను వాడుతుంటారు. 2019లో జాతీయ ఉల్లిపాయల సంఘం జాతీయ ఉల్లిపాయ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఈ రోజును ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్‌లో పెద్ద వేడుకగా జరుపుకుంటారు. ఈ దేశాల్లో ఉల్లిపాయలు వ్యవసాయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి వారికీ చాలా ప్రత్యేకమైనది. ఉల్లిపాయలు తినడం వల్ల మన శరీరానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ, ప్రేగుల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలకు ఇది సహాయపడుతుంది.