నేడు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుట్టినరోజు
ఆంధ్రా యూనివర్సిటీలో లా చదువుతున్న సమయంలో స్టూడెంట్ లీడర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు.
దిశ, ఫీచర్స్ : నెల్లూరుకి చెందిన వెంకయ్య నాయుడు అంచల అంచలుగా బీజేపీలో ఎదిగారు. ఆంధ్రా యూనివర్సిటీలో లా చదువుతున్న సమయంలో స్టూడెంట్ లీడర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఎమర్జెన్సీ కి పోరాటాలు చేసారు.. అరెస్టు అయ్యారు.. జైలుకి కూడా వెళ్లారు. ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత 1978 లో జనతా పార్టీ తరపున నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి మొదటి సారి అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు. 1983 లో రెండో సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ లో నాయకుడిగా పేరు పొందారు. 1998 లో కర్ణాటక నుంచి రాజ్య సభకు ఎన్నికయ్యారుఅప్పటి నుంచి వెంకయ్య నాయుడు జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేశారు. 2002 లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా భాద్యతలు తీసుకున్నారు. ఆయన పార్టీ నిర్మాణానికి ఏంతో కృషి చేసారు. 2004, 2010లో కర్ణాటక రాజ్య సభకు ఎన్నికయ్యారు. ఆయన రాజకీయంలో రైతాంగానికి మేలు చేసే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. 2017 నుండి 2022 వరకు భారతదేశానికి 13వ ఉపరాష్ట్రపతిగా పని చేసాడు. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ప్రముఖులు, సెలబ్రిటీస్ విషెస్ తెలుపుతున్నారు.