దేశవ్యాప్తంగా మూడు వందే భారత్ రైలు మోడళ్లు: ప్రధాని మోడీ

దేశవ్యాప్తంగా మూడు వందే భారత్ రైలు మోడళ్లు స్లీపర్, ఛైర్‌కార్, మెట్రో నడుస్తాయని అని పేర్కొన్నారు.

Update: 2024-04-14 07:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సంకల్ప్‌ పత్ర పేరుతో బీజేపీ మేనిఫెస్టోను ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పలు కీలక ప్రకటనలు చేశారు. అందులో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా మూడు వందే భారత్ రైలు మోడళ్లు నడుస్తాయని అన్నారు. అవి.. వందే భారత్ స్లీపర్, వందే భారత్ ఛైర్‌కార్, వందే భారత్ మెట్రో అని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి గడపకు వందే భారత్ రైళ్లను విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు పేర్కొన్నారు. దేశంలోని ప్రతి మూలకు వందే భారత్ రైళ్లు ప్రయాణిస్తాయి. ఇటీవలే వేగవంతమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పరీక్షించడానికి వెస్ట్రన్ రైల్వేకు కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్ఎస్) అధికారం ఇచ్చిన నేపథ్యంలో మోడీ తాజా ప్రకటన వెలువడింది. ఇది విజయవంతమైతే ముంబై-అహ్మదాబాద్ మార్గంలో ప్రయాణం 45 నిమిషాలు ఆదా అవుతుంది. అలాగే, మొదటి వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలు నడిచే రూట్‌గా ఉండనుంది. ఇక, ఈ ఏడాది మార్చి 12 నాటికి దేశంలో మొత్తం 51 వందే భారత్ రైళ్లు ఉన్నాయి. 2047 నాటికి 4,500 వందే భారత్ రైళ్లను అందుబాటులో ఉండాలని ప్రబుత్వం లక్ష్యంగా ఉంది. 

Tags:    

Similar News