‘ఇండియా’ అధికారంలోకి వస్తే జరిగేది ఇదే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం
ఇండియా కూటమిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. పొరపాటున దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని పదవి కోసం కూటమిలోని అగ్ర నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుందని జోస్యం చెప్పారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. పొరపాటున దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని పదవి కోసం కూటమిలోని అగ్ర నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుందని జోస్యం చెప్పారు. ‘స్టాలిన్, శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ వంటి నాయకులు ఒక్కొక్కరు ఒక్కో ఏడాది ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఉంటుంది. మిగిలి ఉన్న దానితో రాహుల్ సరిపెట్టుకోవాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. బిహార్‌లోని ఝంఝార్‌పూర్‌లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ప్రతిపక్ష కూటమిలో నాయకత్వ లోపం స్పష్టం కనిపిస్తుందని చెప్పారు.
బిహార్‌తో సహా యావత్ దేశాన్ని ఆధునిక యుగం వైపు తీసుకెళ్లాలని మోడీ భావిస్తున్నట్టు తెలిపారు. మూడోసారి మోడీ అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. భారత్ బలమైన ప్రధానిని కోరుకుంటున్నారన్నారు. కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై అమిత్ షా స్పందించారు. అవినీతి పరులపై చర్యలు తీసుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. దేశ ప్రజల డబ్బును దోచుకున్నవారు జైలులో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.