దేశం కోసం ఎంతో చేశా.. రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయం: కంగనా రనౌత్

బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. సోమవారం ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన సమ్మిట్‌లో పాల్గొన్న ఆమె.. తాను ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే సరైన సమయం అన్నారు.

Update: 2024-02-27 14:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. సోమవారం ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన సమ్మిట్‌లో పాల్గొన్న ఆమె.. తాను ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే సరైన సమయం అన్నారు. బాలీవుడ్‌లో స్టార్ హిరోయిన్ గా కొనసాగుతున్న ఆమె.. దర్శకత్వంలోనూ తనకంటూ ఓ పేరును క్రియేట్ చేసుకుంది. అలాగే దేశం, ఆర్మీ పై, సామాన్యులపై, మహిళలపై జరిగే దాడులును ఎప్పటికప్పడు ఎండగడుతూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కంగానా తనకు తానుగా జాతీయవాదిగా ప్రకటించుకుంది. ఈ క్రమంలోనే చాలా సార్లు బాలీవుడ్ మాఫియాను తట్టుకోవడానికి తనకు ఏ రాజకీయ పార్టీ మద్దతు అవసరం లేదని బహిరంగంగానే చెప్పుకొచ్చింది.

తాజాగా ఆమె పాల్గోన్న గ్లోబల్ సమ్మిట్‌లో.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయాల్లో చేరేందుకు ఆమె ఆసక్తి చూపారు. “ఈ దేశం నాకు చాలా ఇచ్చింది, తిరిగి ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నాను. నేను ఎప్పుడూ జాతీయవాదిగా ఉంటాను. నా సినిమాల ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. నాకు మద్దతుగా ప్రజలు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారని.. ఒక వేల నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే సరైన సమయం అని చెప్పుకొచ్చారు. కానీ ఆమె ఏ పార్టీలోకి వెళతారో చెప్పనప్పటికి.. ఆమె పరోక్షంగా చాలా సార్లు బీజేపీకి మద్దతునిచ్చిన విషయం తెలిసిందే.


Similar News