Cabinet highlights : కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే
ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం అయింది.
దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశమయింది. ఈ సమావేశంలో రామ్ నాథ్ కోవింద్ కమిటీ సమర్పించిన జమిలి(Jamili) ఎన్నికలపై కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ వలన ఖర్చు, సమయం కలిసి వస్తుందని మంత్రి వర్గం అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే చదరుని నుండి రాళ్ళు, మట్టి భూమి మీదికి తీసుకు వచ్చే చంద్రయాన్-4(Chandrayan-4) ప్రయోగానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రయాన్ ప్రయోగాన్ని గగన్ యాన్, శుక్రయాన్ కు విస్తరించనున్నట్లు పేర్కొంది. మరియు పీఎం ఆశా పథకానికి రూ.35 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. గిరిజన గ్రామాల అభివృద్దికి రూ.79,156 కోట్ల కేటాయింపులు చేశారు. అంతేకాకుండా ఎన్జీఎల్ఏ(NGLA) వాహననౌకకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకుంది.