రాహుల్ వ్యాఖ్యలకు స్పీకర్ ఓం బిర్లా దిమ్మతిరిగే కౌంటర్.. దద్దరిల్లిన లోక్ సభ

లోక్ సభ సమావేశాలు హాట్ హాట్ సాగుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష నేత

Update: 2024-07-01 11:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్ సభ సమావేశాలు హాట్ హాట్ సాగుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య వాడీవేడిగా చర్చ సాగింది. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించే సమయంలో మీ తీరుగా సరిగ్గా లేదని, ఆ సమయంలో ప్రధాని మోడీకి మీరు తల వంచి నమస్కారం చేశారు.. నాతో మాత్రం నిటారుగా నిలబడి కరచాలనం చేశారని గుర్తు చేశారు. సభాధ్యక్షుడిగా ఫ్లోర్‌లో మీ మాటే వేదవాక్కని, నాతో పాటు విపక్ష నేతలు మిమ్మల్ని గౌరవిస్తారని చెప్పారు. కానీ సభలో స్పీకర్ అందరినీ సమానంగా చూడాలని హితవు పలికారు. ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలకు స్పీకర్ ఓం బిర్లా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ప్రధాని మోడీ వయస్సులో నా కంటే పెద్దవారని, ఏజ్‌లో తన కంటే పెద్దవాళ్లకు తలవంచి నమస్కారం చేయడం మా సంస్కారమని.. అందుకే మోడీకి తలవంచి నమస్కారం చేశానని క్లారిటీ ఇచ్చారు. అలా చేసినందుకు నాకు చాలా గర్వంగా కూడా ఉందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు లోక్ సభలో ప్రతిపక్ష నేతగా తొలి ప్రసంగంలోనే రాహుల్ గాంధీ అధికార ఎన్డీఏ కూటమిపై నిప్పులు చెరిగారు. దీంతో లోక్ సభలో ఇండియా, ఎన్డీఏ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అధికార, ప్రతిపక్షాల డైలాగ్ వార్‌తో లోక్ సభ దద్దరిల్లింది. 


Similar News