బీజేపీ గూటికి కాంగ్రెస్ సీనియర్ నేత కుమారుడు!
కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోని బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోని బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి బీబీసీ తీసిన డాక్యుమెంటరీ వ్యవహారంలో అనిల్ ఆంటోనీ కాంగ్రెస్ తీరును వ్యతిరేకించారు. మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించడం సరికాదని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ లో ఉంటూ పార్టీ విధానాలకు విరుద్ధంగా మోడీకి అనిల్ అంటోనీ మద్దతుగా నిలవడం పార్టీలో చర్చకు దారి తీసింది.
ఈ క్రమలో మోడీ విషయంలో తన అభిప్రాయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయడంతో ‘భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న వాళ్లే తన ట్వీట్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారని’ మనస్థాపంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది జనవరిలో రాజీనామా చేశారు. తాజాగా ఆయన బీజేపీలో చేరారు. అనిల్ ఆంటోనీ తండ్రి ఏకే అంటోని గతంలో డిఫెన్స్ మినిస్టర్ గా పని చేయడంతో పాటు గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అనే పేరు ఉంది. అలాంటి వ్యక్తి తనయుడు బీజేపీలో చేరడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇటీవల రాహుల్ గాంధీ పై లోక్ సభ అనర్హత వేటు వేసింది. రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు. ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అనే ఊహాగానాలు వినిపిస్తున్న తరణంలో కేరళకు చెందిన అనిల్ ఆంటోనీ బీజేపీ తీర్థం పుచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
Delhi | Anil Antony, Congress leader and son of former Defence minister AK Antony, joins BJP, in presence of Union ministers Piyush Goyal and V Muraleedharan pic.twitter.com/c39pybFbdt
— ANI (@ANI) April 6, 2023