చరిత్ర సృష్టించిన కోల్కతా మెట్రో..!

కోల్‌కతా మెట్రో హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగం ద్వారా తొలి పరుగుతో చరిత్ర సృష్టించింది.

Update: 2023-04-13 11:09 GMT

దిశ, వెబ్ డెస్క్: కోల్‌కతా మెట్రో హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగం ద్వారా తొలి పరుగుతో చరిత్ర సృష్టించింది. మహాకరణ్ నుంచి హౌరా మైదాన్ స్టేషన్ వరకు నిర్వహించిన ఈ టెస్ట్ రన్ లో మెట్రో రైల్ జనరల్ మేనేజర్ పి.ఉదయ్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ఇది చారిత్రక ఘట్టమని కొనియాడారు. హుగ్లీ నది కింద 520 మీటర్ల పొడవు ఉన్న ఈ సొరంగాన్ని మెట్రో ట్రైన్ 45 సెకన్లలో దాటేస్తుందని తెలిపారు. ఇక హుగ్లీ నదికి 32 మీటర్ల దిగువన సొరంగాన్ని నిర్మించినట్లు ఆయన పేర్కొన్నారు. 

Tags:    

Similar News